NEWSANDHRA PRADESH

వైసీపీ దారుణాలపై నారా ఫైర్

Share it with your family & friends

విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న అధికారంలో ఉన్న వైసీపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో వైకాపా అఘాయిత్యాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

జీవీఎంసీ 65వ వార్డు నివాసి జ‌లుమూరి రాధ‌పై అదే వార్డు వైసీపీ అధ్య‌క్షుడు మొద‌ల‌వ‌ల‌స లోక‌నాథం పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం చాలా దారుణమ‌న్నారు. జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో సొంత త‌ల్లి, చెల్లికే ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు.

రాధ లాంటి సామాన్య మ‌హిళ‌ల‌కు ఇంకెక్క‌డిది ర‌క్ష‌ణ‌? ఇంటి పట్టాకి లంచం ఎందుకు ఇవ్వాల‌ని నిల‌దీసిన రాధ‌ను వైసీపీ నేత లోక‌నాథం స‌జీవ ద‌హ‌నం చేయాల‌ని అనుకోవ‌డం దారుణ‌మ‌న్నారు.

రాష్ట్రంలో వైకాపా అరాచ‌కాల‌కు ఈ ఘ‌ట‌న అద్దం ప‌డుతోందన్నారు నారా లోకేష్ .నిందితుడైన లోక‌నాథం, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన వైసీపీ నేత‌ల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాలిన గాయాల‌తో ఉన్న బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి, ప్రాణాలు కాపాడాలని కోరారు.