ANDHRA PRADESHNEWS

స‌భ సాక్షిగా నా త‌ల్లిని అవ‌మానించ లేదా..?

Share it with your family & friends

స‌భ‌లో నిప్పులు చెరిగిన నారా లోకేష్

అమ‌రావ‌తి – ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. స‌భ సాక్షిగా వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌భా మ‌ర్యాదాలు పాటించ‌కుండా స‌భ‌కు అడ్డు త‌గిలితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎలా ప‌డితే అలా నోటికి వ‌చ్చిన‌ట్లు కారుకూత‌లు కూసింది మీరు కాదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించి త‌మ గురించి నీచాతి నీచంగా మాట్లాడింది మ‌రిచి పోతే ఎలా అని మండిప‌డ్డారు నారా లోకేష్.

శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. ఆరోజు నా తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రావట్లేదా? తాము ఎప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడ లేదని అన్నారు మంత్రి .

నారా చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. నా తల్లిని అవమానించాకే ఆవేదనతో సభ నుంచి వాకౌట్ చేశారని అన్నారు నారా లోకేష్. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని వైసీపీని ప్రశ్నిస్తున్నాన‌ని అన్నారు. నా తల్లిని అవమానించిన వాళ్లకు వైసీపీ టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్లను మీరు సమర్థించినట్లే కదా జగన మోహ‌న్ రెడ్డి అని నిల‌దీశారు.