మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
అమరావతి – మంత్రి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ లో నమోదు చేసిన పేర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించారని, అరెస్ట్ లకు పాల్పడ్డారని అన్నారు. వ్యక్తిగతంగా దాడులకు పాల్పడిన వారిని వదలబోమంటూ పేర్కొన్నారు.
రెడ్ బుక్ లో నమోదు చేసిన ప్రతి ఒక్కరినీ వదిలి వేసే ప్రసక్తి లేదన్నారు నారా లోకేష్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారంటూ వైసీపీపై , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశామని, ప్రాధాన్యాత క్రమంలో వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చాలక టీడీపీ కూటమి సర్కార్ పై నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు.