మీడియా ప్రశ్నలకు నారా లోకేష్ ఆన్సర్
కడప జిల్లా – మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్బంగా ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే ప్రాంతీయ పార్టీగా చిరస్మరణీయమైన విజయాలు సాధించిన ఘనమైన చరిత్ర టీడీపీకి ఉందన్నారు. తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు ఆయన ఆన్సర్ ఇచ్చారు. ఆ పదవి కోసం ఎందుకు అంత తొందర పడాలంటూ ప్రశ్నించారు. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసలు కురిపించారు. తాను కొడుకునై పుట్టినందుకు గర్వ పడుతున్నానని చెప్పారు.
వయసు రీతా 70 ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ తాను ఇంకా నవ యువకుడేనంటూ పేర్కొన్నారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదని స్పష్టం చేశారు నారా లోకేష్. అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయని అన్నారు. వీరయ్య చౌదరికి నివాళులు అర్పించేందుకు వెళ్తే పొగాకు రైతుల సమస్యలు తెలిశాయని తెలిపారు.
వెంటనే అధికారులను, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేశామన్నారు. పార్టీకి నిరంతరం ఫీడ్‍బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణ అన్నారు. కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతరం చర్చ జరగాలన్నారు. పార్టీ బలంగా ఉండాలి.. సంస్థాగతంగా బాగుండాలన్నారు.