నిప్పులు చెరిగిన మంత్రి నారా లోకేష్
ఢిల్లీ – మంత్రి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. రాత్రి సమయంలో తనకు ఆత్మలతో మాట్లాడే అలవాటుందని ఆరోపించారు. జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని చంపాడని వాపోయారు. నాపై 23 అక్రమ కేసులు పెట్టాడన్నారు. భూములను కాజేశాడని ధ్వజమెత్తారు.
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమను ఇబ్బంది పెట్టిన వారిని ఎందుకు వదిలి వేయాలని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇంకా అధికారంలోనే ఉన్నానని భ్రమల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు.
తప్పకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామన్నారు. వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు నారా లోకేష్. ఎంతో మందిని కావాలని టార్గెట్ చేశాడని, జగన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం కష్టమన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన తనను గెలిపించరని అన్నారు.