నిప్పులు చెరిగిన మంత్రి నారా లోకేష్
అమరావతి – వైసీపీ బాస్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో తన ఐదేళ్ల పాలనా కాలంలో ఏపీని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా ఆదరించిన జనాన్ని నిట్ట నిలువునా మోసం చేశాడని అన్నారు.
ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడని, అందినంత మేర దోచుకున్నాడని మండిపడ్డారు. 58 ఏళ్ల పాటు పాలన సాగించిన ముఖ్యమంత్రుల కంటే జగన్ రెడ్డి చేసిన అప్పులు రెడ్డింతలు ఎక్కువ అని ఆరోపించారు. తను చేసిన అప్పులకు రూ. 24 వేల 944 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉందన్నారు.
సోమవారం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన సాగించడం జరుగుతోందన్నారు. తాను అడ్డగోలుగా చేసిన అప్పులకు సంబంధించి 2019 సంవత్సరం నాటికి రూ. 14,155 కోట్లు వడ్డీ చెల్లించడం జరిగిందన్నారు. గత ఏడాదికి అది రెండింతలైందని అన్నారు నారా లోకేష్.