Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ను సమీక్షిస్తాం

ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ను సమీక్షిస్తాం

ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్

అమరావతిః ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వ విద్యాలయాల వివరాలతో పాటు, విశ్వ విద్యాలయ హోదాను ఇవ్వడానికి అనురిస్తున్న ప్రమాణాలు, ప్రభుత్వ నియంత్రణపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ విశ్వ విద్యాలయాల స్థాపన కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు. అందులో భాగంగానే విట్, ఎస్ఆర్ఎం, సెంచూరియన్, క్రియా యూనివర్సిటీ రాష్ట్రానికి వ‌చ్చాయ‌న్నారు. వీటిపై పునః ప‌రిశీలిస్తామ‌న్నారు నారా లోకేష్.

విట్, ఎస్ఆర్ఎం అమరావతిలో నెలకొల్పగా..సెంచూరియన్ విజయనగరంలో వచ్చింద‌న్నారు. క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాకు వ‌చ్చింద‌ని,. అభివృద్ధి వికేంద్రీకరణకు ఆనాడు కూడా కట్టుబడి చేసి చూపించామనేందుకు ఇదొక ఉదాహరణ అని తెలిపారు మంత్రి. చట్టానికి ఐదుసార్లు సవరణ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం పని చేసిందన్నారు. 4 యూనివర్సిటీలు.. మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచార్య యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీలు బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కింద వచ్చాయని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments