రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం
అమరావతి – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించారు మంత్రి నారా లోకేష్. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే తను జైలుకు వెళ్లాడని అన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. తనపై విచారణకు ఆదేశించామన్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని, తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పక అమలు చేస్తామన్నారు.
నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. తనను కూడా ఇబ్బంది పెట్టారని, అయినా ఎదుర్కొని నిలబడ్డామన్నారు. వీరు చేసిన నిర్వాకం కారణంగానే తాను రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటున్నామని చెప్పారు. అందుకే చెప్పినట్టు గానే ఇప్ఉడు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు నారా లోకేష్.
ప్రస్తుతం శాంపిల్ మాత్రమే చూశారని, ఇంకా చాలా మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. జగన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నరక యాతన పడేలా చేశాడని ఆరోపించారు. పలువురిని ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు.