అధికారంలోకి రావడం ఖాయం
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్
మంగళగిరి – తనను ఓడించినా తనకు మంగళగిరి నియోజకవర్గం అంటే అభిమానమని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . ఓడిన దగ్గరే గెలవాలని తిరిగి మళ్లీ పోటీ చేస్తున్నానని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడారు.
నియోజకవర్గ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్. ఏపీలో పన్నుల మోత మోగిస్తున్నారంటూ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
ముందు నుంచి 100 రూపాయలు ఇచ్చి వెనుక నుంచి 1,000 రూపాయలు లాగేసు కుంటున్నారని ఆరోపించారు నారా లోకేష్. త్వరలో జరిగే శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని, ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు తీసుకు వచ్చాడో చెప్పాలని సవాల్ విసిరారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.