అప్పుల కుప్పగా మార్చిన జగన్
నిప్పులు చెరిగిన నారా లోకేష్
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ బేకార్ అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ఆరోపించారు.
గత అయిదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తల పండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందన్నారు. రాష్ట్రాన్ని 12.5 లక్షలకోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడం దారుణమన్నారు.
దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర సీఎం సచివాలయాన్ని తాకట్టు పెట్టిన దాఖలాలు లేవన్నారు. తాకట్టు పెట్టడంలో, అప్పులు తీసుకు రావడంలో సెన్సేషన్ క్రియేట్ చేశాడంటూ సెటైర్ వేశారు. ఏపీని అప్పుల ఊబిలోకి దించిన జగన్ రాష్ట్రాన్ని మరో శ్రీలంక లాగా మార్చేశారంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టిన జగన్ రెడ్డికి తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని పేర్కొన్నారు నారా లోకేష్.