NEWSANDHRA PRADESH

రాజ‌ధానుల పేరుతో జ‌గ‌న్ రాజ‌కీయం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన నారా లోకేష్

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. న‌వ ర‌త్నాలు పేరుతో అధికారంలోకి వ‌చ్చిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి రాచ‌రిక పాల‌న సాగించారంటూ ఆరోపించారు.

నిన్న‌టి దాకా ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు రాజ‌ధానుల పేరుతో నిట్ట నిలువునా మోసం చేశాడ‌ని ఆరోపించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే మూడు ముక్క‌లాట ఆడారంటూ ఫైర్ అయ్యారు.

త్వ‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయ‌ని కొత్త రాజ‌కీయానికి తెర లేపాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌స్తుతం ఆర్థిక రాజ‌ధాని పేరుతో విశాఖ‌ను స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని మండిప‌డ్డారు నారా లోకేష్. విచిత్రం ఏమిటంటే లక్ష‌లాది మందికి ఇళ్లు లేక ఇబ్బందులు ప‌డుతుంటే మ‌రో వైపు జ‌గ‌న్ రెడ్డి తన సౌక‌ర్యం కోసం ఏకంగా రూ. 500 కోట్ల‌తో ప్యాలెస్ క‌ట్టుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.