జగన్ పాలన కోడ్ ఉల్లంఘన
నిప్పులు చెరిగిన నారా లోకేష్
అమరావతి – రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గత ఐదేళ్లుగా సీఎం ఆటవిక పాలన సాగుతోందని ఆరోపించారు.
సోమవారం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. దౌర్జన్యపు పాలన ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చినా కొనసాతుండడం దారుణమన్నారు. . వైకాపా అధినేత జగన్ గొడ్డలితో తెగ బడితే, వైకాపా కార్యకర్తలు వేట కొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని ఆరోపించారు నారా లోకేష్.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో టీడీపీ కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇది ముమ్మాటికీ వైకాపా సైకోల పనేనని ఆరోపించారు.
ఓటమి భయంతో టిడిపిలో క్రియాశీలక కార్యకర్తల్ని అంతం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం అండతో చెలరేగుతున్న వైకాపా కాలకేయులకు తాము పవర్ లోకి వచ్చాక చర్యలు తప్పవన్నారు..