మార్పు కోరుకుంటున్న జనం
మంగళగిరి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉండేది ఇంకా కొన్ని రోజులు మాత్రమేనని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన శాసన సభ ఎన్నికల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కోసం బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పట్టణ వాసులతో ముఖాముఖి నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తాము పవర్ లోకి వచ్చాక వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్. నియోజకవర్గానికి సంబంధించి తమ వద్ద ప్లాన్ ఉందన్నారు. ఇప్పటికే దీనిని తయారు చేసినట్లు చెప్పారు.
తాను గెలిచిన మరుసటి రోజు నుంచే మంగళగిరి నియోజకవర్గ అభివృద్దిపై ఫోకస్ పెడతానని స్పష్టం చేశారు నారా లోకేష్. నియోజకవర్గం అభివృద్ది కోసం మేధావులు, బుద్ది జీవులు సూచనలు చేయాలని కోరారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.