జగన్ మోసం జనం ఆగమాగం
ఏపీ సీఎంపై నారా లోకేష్ కామెంట్
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ట్బిట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ అంటూ పవర్ లోకి వచ్చిన జగన్ ఉన్నదంతా ఊడ్చేశాడని మండిపడ్డారు. ఇవాళ ఉన్న వ్యవస్థలను పనికి రాకుండా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ రత్నాలు పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టాడని ఫైర్ అయ్యారు.
జగన్ ను నమ్మినందుకు నట్టేట ముంచాడని, ఏపీని అప్పుల కుప్పగా మార్చేశాడని, ఇవాళ అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. పెన్షన్లు తాము నిలిపి వేయించామంటూ మరో కొత్త నాటకానికి తెర లేపాడని ధ్వజమెత్తారు.
జగన్ ఆస్కార్ కు మించిన నటుడంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎవరూ ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే అంత బాగుంటుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు నారా లోకేష్. ఇకనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విలువైన ఓటు పని చేసే వారికి వేయాలని కోరారు.