వైసీపీ దాడులపై లోకేష్ ఫైర్
అధికారం పోతుందనే దౌర్జన్యాలు
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీలో ఎన్నికలు ముగిసినా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోనీయకుండా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన నేతలు విచ్చలవిడిగా వ్యవహరించారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం సీరియస్ అయినా డీజేపీ, సీఎస్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు కూడా సీఎస్, డీజీపీకి జారీ చేసిందని పేర్కొన్నారు నారా లోకేష్.
అధికారం శాశ్వతం అనే భ్రమలో వైసీపీ నేతలు ఉన్నారని, అందుకే ఇష్టానుసారంగా తెలుగుదేశం , జనసేన, బీజేపీ కూటమికి చెందిన నేతలను టార్గెట్ చేశారని ఆవేదన చెందారు. అయినా తాము సంయమనం పాటించాలని కానీ ఇప్పటికీ దాడులకు తెగ బడటం దారుణమన్నారు నారా లోకేష్.
మహిళలని చూడకుండా దుర్భాషలాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.