Sunday, April 6, 2025
HomeNEWSANDHRA PRADESHబెదిరించ‌డం భ‌య పెట్ట‌డం మాకు రాదు

బెదిరించ‌డం భ‌య పెట్ట‌డం మాకు రాదు

నిప్పులు చెరిగిన మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి – ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మంత్రి నారా లోకేష్. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌న్నారు. వీసీల‌కు తాము బెదిరించిన‌ట్లు నిరూపించాల‌ని సవాల్ విసిరారు. భ‌య పెట్ట‌డం, బెదిరించ‌డం త‌మకు రాద‌న్నారు. వీసీల‌ను బ‌ల‌వంతంగా రాజీనామాలు చేయించార‌ని ఎమ్మెల్సీ చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు. ఇంత‌కు మించి ఇంకేం అన‌గ‌ల‌ర‌ని అన్నారు. ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని వీలైతే ఆధారాల‌తో రావాల‌న్నారు నారా లోకేష్‌.

నారా లోకేష్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. విసిలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తాన‌ని అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు.

19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17మంది విసిలను బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…. వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి? గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయి. ఎవరు బెదిరించారో చెప్పమనండి.

గతంలో ఎపిపిఎస్ సి చైర్మన్ ను రూంలోకి వెళ్లకుండా తాళం వేశారు. మీరా మాట్లాడేది? మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు నారా లోకేష్. విసిలు తప్పుచేశారు కనుకే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఎవరు బెదిరించారో చెప్పండి,నేను ఛాలెంజ్ చేస్తున్నాను.

ఎపిపిఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పండి. విసి పదవులకు కోసం 500 మంది దరఖాస్తు చేశారు, గత ప్రభుత్వం మాదిరి విసి పోస్టులను ఒకేవ ర్గానికి కట్ట బెట్ట‌లేద‌న్నారు. సామాజిక న్యాయం చేశామ‌న్నారు. విద్యావేత్తలను విసిలుగా నియమించామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments