జగన్ రెడ్డి ఇక ఇంటికే – లోకేష్
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
మంగళగిరి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెజవాడకు చెందిన ప్రముఖులు కొందరు టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్బంగా లోకేష్ ప్రసంగించారు. టీడీపీ కూటమికి కనీసం 170 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రజలు పూర్తిగా క్లారిటీతో ఉన్నారని చెప్పారు. వారంతా గంప గుత్తగా కూటమికి జై కొట్టేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు నారా లోకేష్.
ఏపీని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను సర్వ నాశనం చేశారని పేర్కొన్నారు. తమ నేతలకు జనం ఆదరిస్తున్నారని చెప్పారు నారా లోకేష్. దోచు కోవడం దోచుకున్న దానిని దాచు కోవడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారంటూ ధ్వజమెత్తారు.