ఏపీ చిన్నోడి ప్రతిభకు నారా లోకేష్ ఫిదా
నవంబర్ లో రాష్ట్రానికి రావాలని పిలుపు
అమరావతి – ప్రతిభ ఎక్కడున్నా గుర్తించే తత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు ఉందనడంలో సందేహం లేదు.
తాజాగా ఏపీకి చెందిన 11 ఏళ్ల వయసు కలిగిన చిన్నోడు అఖిల్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు నారా లోకేష్. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. తను ప్రస్తుతం యుకెలో చదువుతున్నాడు. దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రో సాఫ్ట్ సర్టిఫైడ్ అజూర్, డేటా, సెక్యూరిటీ, ఏఐ ఫౌండేషన్ సర్టిఫికెట్లను పూర్తి చేశాడు. దిగ్విజయంగా సర్టిఫికెట్లు కూడా అందుకున్నాడు.
అంతే కాదు అఖిల్ యుకె లో నిర్వహించే పలు టెక్ సమ్మిట్ లకు కూడా హాజరవుతున్నాడు. సీనియర్ లీడర్ షిప్ లతో కూడా చర్చిస్తున్నాడు.
ఈ సందర్బంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా నారా లోకేష్ కు స్వయంగా ట్వీట్ చేశాడు. అమరావతిలో టెక్ ల్యాండ్ స్కేప్ ను పెంచాలని కోరిక ఉందని తెలిపాడు. ఆన్ డిమాండ్ టెక్నాలజీలతో విద్యార్థులలో నైపుణ్యాలను పెంచేందుకు ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు అఖిల్. దీని ద్వారా సాఫ్ట్ వేర్ కంపెనీలను ఆకర్షించేందుకు వీలుందన్నాడు.
దీనిపై వెంటనే స్పందించారు నారా లోకేష్. అఖిల్ ను ప్రత్యేకంగా అభినందించారు. నీ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని, నవంబర్ మొదటి వారంలో మనం కలుసుకుందామని , భవిష్యత్తులో కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు మంత్రి.