NEWSANDHRA PRADESH

తెలుగు జాతి ఆత్మ గౌర‌వం ఎన్టీఆర్

Share it with your family & friends

మే 28న నంద‌మూరి జ‌యంతి

అమ‌రావ‌తి – దివంగ‌త మాజీ ఏపీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి ఇవాళ‌. మే 28న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు జాతి కీర్తి కిరీట‌మ‌ని పేర్కొన్నారు. విశ్వ విఖ్యాత న‌ట సార్వ భౌముడ‌ని కొనియాడారు నారా లోకేష్. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం ,రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని ప్ర‌శంస‌లు కురిపించారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథా నాయకుడు ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా. తాతయ్య నందమూరి తారక రామారావు గారే త‌న‌కు నిత్య స్ఫూర్తి అని పేర్కొన్నారు నారా లోకేష్‌.