NEWSANDHRA PRADESH

పెట్టుబ‌డిదారుల‌కు ఏపీ స్వ‌ర్గ ధామం

Share it with your family & friends

పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్

అమెరికా – యుఎస్ఏ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు , కంపెనీల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స్వ‌ర్గ ధామ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.
ఏపీ లో పెట్టుబడులు పెట్టాల‌ని, మీకు అండగా నిలచే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

చంద్రబాబు పేరు చెప్పగానే దిగ్గజ కంపెనీల రెడ్ కార్పెట్ ప‌రుస్తున్నాయ‌ని తెలిపారు. సిబిఎన్ బ్రాండ్ తోనే ఫార్చూన్ 500 కంపెనీలతో చర్చలు జరిపామ‌న్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఎన్టీఆర్..ఆయన ఆశయాలతో ముందుకు వెళ‌తామ‌ని చెప్పారు.

రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్ చేస్తామ‌న్నారు. తప్పు చేసిన వారిని వదిలేది లేదన్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. యుఎస్ లోని అట్లాంటాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

మంత్రిగా టాటా చైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 90 నిమిషాలు చర్చించి టిసిఎస్ తేగలిగానంటే దానికి కారణం సిబిఎన్ అని అన్నారు. ఒక్క మెయిల్ తో సత్యనాదెళ్ల అపాయింట్ మెంట్ ఇచ్చారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు.

ఈ సందర్భంగా హెలికాప్టర్ పైనుంచి పూలవర్షం కురిపించి ఎన్ఆర్ఐ టిడిపి కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. జోహార్ అన్న ఎన్ టి ఆర్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… వారంరోజుల అమెరికా పర్యటనలో నేను ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా సిబిఎన్ పేరు చెప్పగానే రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చెప్పారని అన్నారు.

అదీ ఈరోజు మనకున్నసిబిఎన్ బ్రాండ్ ఇమేజ్. ఆ బ్రాండ్ తోనే నేను ఫార్చూన్ 500 కంపెనీలకు వెళ్లి పెట్టుబడులు పెట్టాలని కోరానని అన్నారు.