ప్రశాంతతకు నిలయం పుట్టపర్తి
టీడీపీ నేత నారా లోకేష్ కామెంట్
పుట్టపర్తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహా శివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన సాయి బాబాకు పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
ప్రశాంతి నిలయాన్ని సందర్శించడం మరిచి పోలేనని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుస్తుందన్నారు నారా లోకేష్. సాయీశ్వర లింగం వద్ద జరిగిన పూజల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
భగవాన్ సాయిబాబా ఆశీస్సులతో ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న సత్యసాయి సేవా సంస్థ చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. సత్యసాయి సంస్థల సేవలను మరింత విస్తృతం చేయడానికి అవసరమైన సహాయ,సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.
ప్రధానంగా ఆధ్యాత్మికతో పాటు విద్యా రంగం పట్ల చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు.