DEVOTIONAL

మల్ల‌న్న స‌న్నిధికి నారా లోకేష్

Share it with your family & friends

రేపు ద‌ర్శించు కోనున్న టీడీపీ నేత

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్జీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గురువారం ప్ర‌ముఖ పుణ్య క్షేత్ర‌మైన శ్రీ‌శైలంలోని మ‌ల్లికార్జున స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటారు. ఉద‌యం 7.30 గంట‌ల‌కు హైద‌రాబాద్ లోని త‌న నివాసం నుంచి బ‌య‌లు దేరుతారు. వ‌యా డిండి, అచ్చంపేట‌, అమ్రాబాద్, మున్న‌నూరు, ఈగ‌ల పెంట‌, దోమ‌ల పెంట మీదుగా శ్రీ‌శైలం క్షేత్రానికి చేరుకున్నారు. మార్గ మ‌ధ్యంలో టీడీపీ శ్రేణుల‌ను, అభిమానుల‌ను క‌లుసుకుంటారు.

ఫిబ్ర‌వ‌రి 1న ఉద‌యం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి లోకేష్ బయలు దేరుతారు. అక్క‌డి నుంచి నేరుగా 9 గంట‌ల‌కు శ్రీశైలం మండలం సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు.

9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ శ్రీభ్రమరాంభికా మల్లికార్జున స్వామిని దర్శించుకొని స్వామివారి పూజల్లో పాల్గొంటారు. 10.30కి అక్కడనుంచి బయలుదేరి సున్నిపెంట చేరుకొని, అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళతారు నారా లోకేష్ బాబు.