మల్లన్న సన్నిధిలో లోకేష్
శ్రీశైలంకు చేరుకున్న టీడీపీ నేత
శ్రీశైలం – కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ద శైవ పుణ్య క్షేత్రమైన శ్రీశైలాన్ని సందర్శించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బుధవారం ఆయనకు ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, అభిమానులు.
అనంతరం శ్రీశైల పుణ్య క్షేత్ర పరిధిలోని సాక్షి గణపతి, వీరభద్ర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన పూజారులు నారా లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మల్లికార్జున స్వామికి పూజలు చేశారు.
అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు. ప్రసాదం ఇచ్చారు. అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఎప్పటి లాగే మల్లన్నను దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈసారి తాము పవర్ లోకి వస్తామన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.
తాము అధికారం లోకి వచ్చాక పుణ్య క్షేత్రాలను మరింత సర్వాంగ సుందరంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఆలయ వ్యవస్థ నిర్వీర్యంగా మారిందని ఆవేదన చెందారు నారా లోకేష్.