రూ. 50 కోట్లతో నారాయణమూర్తి ఫ్లాట్ కొనుగోలు
సంచలనంగా మారిన ఇన్ఫోసిస్ చైర్మన్
బెంగళూరు – ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలకమైన సంస్థగా పేరు పొందిన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి సంచలనంగా మారారు. ఆయన ఏకంగా రూ. 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అత్యంత ఖరీదైన ఫ్లాట్ ను బెంగళూరులో కొనుగోలు చేశారు. ఇది వైరల్ గా మారింది దేశ వ్యాప్తంగా.
ఇదిలా ఉండగా నారాయణ మూర్తి కింగ్ ఫిషర్ టవర్స్ లో ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ 8,400 చదరపు అడుగుల విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. దీనికి ఆయన భారీ ఎత్తున ఖర్చు చేశారు.
ఈ ప్రాంతంలో రికార్డు ధర రూ. 59,500. ఇది అతని రెండవ కొనుగోలును సూచిస్తుంది. ఆయన భార్య సుధా మూర్తి నాలుగేళ్ల క్రితం 23వ అంతస్తులో రూ.29 కోట్లతో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.
యుబి సిటీ వెనుక ఉన్న, 34 అంతస్తుల కింగ్‌ఫిషర్ టవర్స్‌లో 81 బెస్పోక్ అపార్ట్‌మెంట్లు , బయోకాన్స్ కిరణ్ మజుందార్-షా వంటి ప్రముఖులకు సంబంధించిన ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో.