శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడిలో
తిరుపతి – నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 4న రథ సప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథస ప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటప లకం, నాభి, పాద కమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.
స్వామీ అమ్మ వార్లు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఉదయం 6.40 నుండి 7.40 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 9 నుండి 9.30 గంటల వరకు పల్లకి ఉత్సవం, ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు కల్పవృక్ష, 11.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పెద్ద శేష వాహనం, మధ్యాహ్నం 12.30 నుండి 1గంట వరకు తిరుచ్చిపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.