ప్రధానిగా కొలువు తీరనున్న మోడీ
కేంద్ర సర్కార్ ఏర్పాట్లు పూర్తి
న్యూఢిల్లీ – ఎన్డీయే – బీజేపీ కూటమి పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికైన నరేంద్ర దామోదర దాస్ మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా కొలువు తీరనున్నారు. భారత దేశ చరిత్రలో అరుదైన రికార్డ్ నమోదు చేశారు. గతంలో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మూడుసార్లు ప్రధానమంత్రిగా పని చేసిన ఘనత దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి మాత్రమే దక్కింది.
ఆయనపై నమోదైన రికార్డును ఇవాళ చెరిపి వేయనున్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆయన అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో టీ అమ్మారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. గుజరాత్ మోడల్ పేరుతో దేశంలో సంచలనం సృష్టించారు. అనేక రంగాలలో అభివృద్దికి మార్గం చూపారు.
ఇదే నినాదంతో 2014లో ఎన్నికల రంగంలోకి దిగారు. ఊహించని రీతిలో గెలుపొందారు. పీఎం అయ్యారు. ఆ తర్వాత 2018లో భారీ మెజారిటీని సాధించారు. తిరిగి ప్రధానిగా కొలువు తీరారు. తాజాగా 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన మేర మెజారిటీని సాధించ లేక పోయారు. టీడీపీ, జేడీయూ పార్టీల మద్దతుతో మూడోసారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.