డాక్టర్ శాంతా రావు నార్నేకు సీఎం కంగ్రాట్స్
అమరావతి – ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్, చైర్మన్ నార్నే రంగారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి డాక్టర్ శాంతారావు భారీ విరాళాన్ని అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు రూ.1,00,01,016 విరాళంగా అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించింది. ప్రతి రోజూ లక్షలాది మంది అన్నార్థుల ఆకలిని నింపుతోంది. ఈ సందర్భంగా సర్కార్ చేస్తున్న ప్రయత్నం అద్భుతమని కొనియాడారు శాంతా రావు.
ఈ సందర్బంగా రూ. కోటికి పైగా విరాళాన్ని అంద చేయడం పట్ల ప్రత్యేకంగా ప్రశంసించారు సీఎం చంద్రబాబు నాయుడు. తనకు సైతం స్పూర్తి నింపారని పేర్కొన్నారు. ఇదే సమయంలో అనారోగ్యం కారణంగా చని పోవడానికి ఒకరోజు ముందు రూ. 1 కోటి విరాళం అందించే విషయాన్ని నార్నే రంగారావు డాక్టర్ శాంతారావుకు గుర్తు చేయడం ఆయనకు సమాజం పట్ల , ఈ ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ ఏమిటో తెలియ చేస్తుందన్నారు.
ఆయన మరణానంతరం తన కుమార్తె, నార్నె ఎస్టేట్స్ డైరెక్టర్ అడుసుమిల్లి దీప, వైట్ ఫీల్డ్ బయో ఎండీ అడుసుమిల్లి నరేష్ కుమార్, సీఇఓ నార్నే గోకుల్ తో కలిసి సిఇఓ నార్నే గోకుల్ తో కలిసి విరాళాన్ని అందించారు. పేదలకు రూ. 5 కే అన్నం పెట్టడం అద్భుతమన్నారు. డాక్టర్ శాంతా రావు, నార్నే సంస్థల స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు దాతలు అన్న క్యాంటీన్ కు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.