బీజేపీ కండువా కప్పుకున్న పారిశ్రామికవేత్త
న్యూఢిల్లీ – దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆయా పార్టీల నుంచి వలసలు ప్రారంభం అయ్యాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ , ఏ పార్టీలోకి వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ తాను ఇక ఉండ లేనంటూ ప్రకటించారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపించారు.
ఆ వెంటనే ఆయన నేరుగా రాజధాని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. అనంతరం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా నవీన్ జిందాల్ మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో చేరినందుకు గర్వంగా ఉందన్నారు. డైనమిక్ లీడర్ నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు జిందాల్.