అజాత శత్రువు నవీన్ పట్నాయక్
ప్రమాణ స్వీకారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
ఒడిశా – భారత దేశ రాజకీయాలలో విలక్షణమైన నాయకుడు ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఆయన సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రంలో పాలన సాగించారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. సౌమ్యుడిగా, ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు.
కాగా తాజాగా ఈ ఏడాది 2024లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా సీఎంగా కొలువు తీరారు మోహన్ చరణ్ మాఝీ . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, నితిన్ గడ్కరీ. వీరితో పాటు యూపీ, అస్సాం సీఎంలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్బంగా రాజకీయంగా ప్రత్యర్థులు అయినప్పటికీ ఆయన ఎక్కడా విజ్ఞత కోల్పోలేదు. స్వయంగా తానే వచ్చారు నవీన్ పట్నాయక్. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు. రాజకీయ సంబంధాలను నెరపడంలో తనకు సాటిరారు ఎవరూ అని చాటి చెప్పారు. ఇందుకు సంబంధించి నవీన్ పట్నాయక్ వైరల్ గా మారారు.