ప్రజా తీర్పుపై ఆలోచిస్తాం
మాజీ సీఎం నవీన్ పట్నాయక్
ఒడిశా – సుదీర్ఘ కాలం పాటు భారత దేశ చరిత్రలో సీఎంగా కొలువు తీరిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ రికార్డ్ బ్రేక్ చేశారు. కానీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది ఊహించని పరిణామం. ఎలాంటి వివాదాలకు, విభేదాలకు తావు ఇవ్వకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు నవీన్ పట్నాయక్.
ఆయనకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూల్ ఇమేజ్ దక్కింది. ఈసారి జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో అనూహ్యంగా నవీన్ పార్టీని తిరస్కరించారు. కాషాయానికి పట్టం కట్టారు. ఈ సందర్భంగా తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
గవర్నర్ ను కలిసి తన లేఖను అందజేశారు. పేదరికాన్ని 70 శాతం నుండి 10 శాతం తగ్గించేందుకు శత విధాలుగా ప్రయత్నం చేయడం జరిగిందని ఈ సందర్బంగా చెప్పారు నవీన్ పట్నాయక్. ఆయన మీడియాతో మాట్లాడారు.
వ్యవసాయం, నీటిపారుదల, మహిళా సాధికారతలో తమ కృషి ఈ విజయానికి దారి తీసిందని చెప్పారు నవీన్ పట్నాయక్.