అస్సాం సీఎంపై పట్నాయక్ సెటైర్
తన రాష్ట్రంపై ఫోకస్ పెడితే మంచిది
ఒడిశా – పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. దేశంలోనే ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఎలాంటి ప్రచారాన్ని కోరుకోరు. తను, తన రాష్ట్రం , ప్రజలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. అనవసరంగా ఆర్భాటాలకు వెళ్లరు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అత్యంత సాదా సీదా జీవితాన్ని ఇష్ట పడతారు.
పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. అవసరమైన సమయంలోనే బయటకు వస్తారు. తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. తాజాగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా మంది బీజేపీ సీఎంలు, కేబినెట్ మంత్రులు ఒడిశాకు వస్తున్నారని, దేశంలోనే తమ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని ప్రకటిస్తున్నారని అన్నారు. ఇదే విషయాన్ని పలు రాష్ట్రాలకు వెళ్లి ఇలానే చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో తమ గురించి మాట్లాడిన అస్సాం సీఎం బిశ్వంత శర్మ ముందు తన రాష్ట్రం గురించి ఫోకస్ పెడితే బావుంటుందని సూచించారు నవీన్ పట్నాయక్.