భారత ప్రధాని లేక పోవడం వెలితిగా ఉంది
పాకిస్తాన్ – పాకిస్తాన్ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ గురించి కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బుధవారం నవాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పాకిస్తాన్ దేశ ప్రభుత్వ ఆధ్యర్యంలో ఎస్సీఓ సమ్మిట్ జరుగుతోంది. ఈ కీలక సమావేశానికి వివిధ దేశాలకు చెందిన ప్రధానులతో పాటు అధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. కీలక ఆతిథ్యాన్ని పాకిస్తాన్ ఇస్తున్న ఈ సందర్బంగా ప్రపంచ నాయకుడిగా పేరు పొందిన తన స్నేహితుడు మోడీ లేక పోవడం వెలితిగా అనిపించిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నవాజ్ షరీఫ్.
ఎస్‌సిఓ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరై ఉంటే చాలా బాగుండేదని, కానీ ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు మాజీ ప్రధానమంత్రి. భారత దేశంతో పాకిస్తాన్ సత్ సంబంధాలను కలిగి ఉండాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు నవాజ్ షరీఫ్.
భవిష్యత్తులోనైనా తాను ప్రధాని మోడీని కలుసు కోవాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ప్రధానమంత్రి.