పాటలకు రూ. 10 కోట్లు ఇవ్వాలా
ధనుష్ పై భగ్గుమన్న నయనతార
తమిళనాడు – ప్రముఖ తమిళ సినీ నటి నయనతార సీరియస్ కామెంట్స్ చేశారు. నటుడు ధనుష్ పై సంచలన ఆరోపణలు చేశారు. రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంటూ ఆవేదన చెందారు. శనివారం ఎక్స్ వేదికగా సీరియస్ గా స్పందించారు.
నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల నయనతారపై నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ విడుదలైంది. భారీ ఎత్తున ఆదరణ పొందింది. ఓటీటీ సంస్థకు పెద్ద ఎత్తున కాసులు వచ్చేలా చేశాయి. ఈ డాక్యుమెంటరీ నయన్ పై నిర్మించారు నటుడు ధనుష్. ఇదిలా ఉండగా ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.
ఆయన అందించిన పాటలు మరింత పాపులర్ అయ్యాయి. వీటిని తాను వాడుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ వాపోయారు నయనతార. విచిత్రం ఏమిటంటే రూ. 10 కోట్లు తనను డిమాండ్ చేయడం దారుణమని పేర్కొన్నారు.
ఈ డాక్యుమెంటరీలో నయనతారతో పాటు విజయ్ సేతుపతి నటించారు. విచిత్రం ఏమిటంటే ఈ డాక్యుమెంటరీకి నయన్ భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.