మాజీ మంత్రి బాబా సిద్దిక్ కాల్చివేత
ఇద్దరు అనుమానితులు అరెస్ట్
మహారాష్ట్ర – ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ కాల్చివేతకు గురయ్యారు. ఆయన వయసు 65 ఏళ్లు. మాఫియా లీడర్ గా గుర్తింపు పొందారు. బెదిరింపులు, ముఠా సంబంధాలతో ముడి పడి ఉంది ఆయన కెరీర్. బాబా సిద్దిక్ కాల్చేవత ముంబై నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
ఇదిలా ఉండా మరాఠా కేబినెట్ లో మంత్రిగా పని చేశారు బాబా సిద్దిక్. ఆయన బాంద్రా పశ్చిమ శాసన సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పూర్తి పేరు బాబా జియావుద్దీన్ సిద్దిక్.
బాంద్రా తూర్పు నియోజకవర్గం నుండి బాబా సిద్దిక్ తనయుడు జీషన్ సిద్దక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన కొడుకుతో ఆఫీసు వెలుపల నిలిచి ఉన్న మాజీ మంత్రిపై ముగ్గురు వ్యక్తులు కాల్పులకు తెగ బడ్డారు. ఖేర్ నగర్ వద్ద శనివారం రాత్రి 9.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
కాల్పుల అనంతరం జియా సిద్దిక్ ను హుటా హుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఆరు ఖాళీగా పడి ఉన్న బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
యూపీ, హర్యానాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. 15 రోజుల కిందట ప్రాణ హాని ఉందనే సమాచారం అందడంతో వై కేటగిరీ భద్రత కల్పించామన్నారు.