మలివాల్ కు మహిళా కమిషన్ అండ
దాడికి గురి కావడం బాధాకరం
న్యూఢిల్లీ – జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ ఆప్ ఎంపీ , మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ పై ఆప్ చీఫ్ , సీఎం కేజ్రీవాల్ పీఏ కపూర్ వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తన ఇంట్లో దాడి చేస్తుంటే ఎలా మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. దీనిని తాము సుమోటోగా తీసుకుంటున్నామని ప్రకటించారు.
రేఖా శర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్నామని, తాము ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు రేఖా శర్మ.
తమ అధి నాయకుడి నివాసంలో ఇలా దాడికి గురవుతుందని తాను కూడా కలలో కూడా అనుకోలేదన్నారు జాతీయ మహిళా హక్కుల కమిషన్ చైర్ పర్సన్. దీనిని సీరియస్ గా తీసుకుంటామని, విచారణకు ఆదేశిస్తామని చెప్పారు . తాను ఆమెకు అండగా ఉంటానని చెప్పానని తెలిపారు.