పవన్ ప్రచారం ఎన్డీయే విజయం
ప్రచారం చేసిన అన్నింట్లోనూ గెలుపు
అమరావతి – జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల అరుదైన ఘనత సాధించారు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు ముగిశాయి. పవన్ పార్టీ కీలకంగా ఉన్న ఎన్డీయేకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు డిప్యూటీ సీఎం.
పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారం చేసిన అన్ని శాసన సభ నియోజకవర్గాలలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
మహారాష్ట్ర లోని డేగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలోని మూడు స్థానాలు, బల్లార్ పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్ పూర్, కస్బాపేట్ నియోజకవర్గాలలోని మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కల్యాణ్ సభల్లో పాల్గొని ప్రసంగించారు.
రోడ్ షోలో పాటు సభలు చేపట్టారు. పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు అన్నిటా విజయం దక్కడంతో మరోసారి 100 శాతం రిజల్ట్ మార్క్ అందుకున్నారు. లాతూర్ సిటీ, డేగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం అందుకోవడం గమనార్హం.
దీంతో ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు.