NEWSANDHRA PRADESH

ఏపీ నూత‌న సీఎస్ గా నీర‌బ్ కుమార్

Share it with your family & friends

ఆయ‌న వైపే మొగ్గు చూపిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – రాష్ట్రంలో అధికారం కోల్పోవ‌డం టీడీపీ ప‌వ‌ర్ లోకి రావ‌డంతో ఊహించ‌ని రీతిలో ఉన్న‌తాధికారులకు స్థాన చ‌ల‌నం క‌లుగుతోంది. నారా చంద్ర‌బాబు నాయుడు ఈనెల 12న సీఎంగా కొలువు తీర‌నున్నారు. ఊహించని రీతిలో ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చారు. అధిక సంఖ్య‌లో సీట్లు ద‌క్కాయి.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చుక్క‌లు చూపించారు. దీంతో సీఎస్ గా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో కీల‌క‌మైన ప‌ద‌వుల్లో ఉన్న వారంతా సెల‌వుల్లో వెళుతున్నారు. దీంతో కాబోయే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క్షాళ‌న చేప‌ట్టారు. కీల‌క పోస్టుల‌లో త‌న వారిని నియ‌మించుకునే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌స్తుతం బాబు ఢిల్లీలో మ‌కాం వేశారు. ఆయ‌న ఎన్డీయేలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు జ‌వ‌హ‌ర్ రెడ్డి స్థానంలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు.