సత్తా చాటిన నీరజ్ చోప్రా
కాంస్య పతకంతో మెరిశాడు
పారిస్ – పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో పోటీలలో భారత్ కు చెందిన నీరజ్ చోప్రా సత్తా చాటాడు. రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒక రకంగా భారత అభిమానులను నిరాశ పరిచాడు. అందరూ నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధిస్తాడని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో రాణించ లేక పోయాడు.
2020లో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ పోటీలలో ఎలాంటి అంచనాలు లేకుండానే నీరజ్ చోప్రా బరిలోకి దిగాడు. కానీ ఊహించని రీతిలో దుమ్ము రేపాడు. అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఈటెను బలంగా విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా.
ఈసారి కూడా సత్తా చాటుతాడని, భారత్ కు పేరు తీసుకు వస్తాడని అనుకున్నారు. కానీ 143 కోట్ల భారతీయుల ఆశలపై నీళ్లు చల్లాడు. మొత్తంగా నీరజ్ చోప్రా పరువు పోకుండా కాంస్య పతకంతో సరిపెట్టాడు.
ఇదిలా ఉండగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నీరజ్ చోప్రాను అభినందించారు.