నీట్ యూజీ ఫలితాలపై సుప్రీం తీర్పు
నగరాలు..కేంద్రాల వారీగా ప్రచురించండి
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయూమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ యూజీ 2024 ఫలితాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. భారీ ఎత్తున స్కాం చోటు చేసుకుందని బాధిత విద్యార్థులు ఆరోపించారు. సుప్రీంకోర్టులో 100 మందికి పైగా పిటిషన్లు దాఖలు చేశారు.
గురువారం నీట్ యూజీ స్కాంపై గురువారం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఫలితాలను నగరాలు, కేంద్రాల వారీగా ప్రచురించాలని ఆదేశించింది. పూర్తి ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెబ్ సైట్ లో వెల్లడించాలని స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.
ఇదిలా ఉండగా నీట్ – యూజీ పరీక్షా రిజల్ట్స్ శనివారం మధ్యాహ్నం వరకు సిటీ, సెంటర్ల వారీగా క్రాస్ రిఫరెన్స్ తో పూర్తిగా ప్రచురించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు బీహార్ నుండి నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. జార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలలో క్రియాశీలకంగా అనుమానం వ్యక్తం చేస్తున్న లీక్ లకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీజేఐ.