నీట్ అవకతవకలపై సుప్రీం విచారణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా నీట్ యుజి -2024 పరీక్షలకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించి సోమవారం కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్.
నీట్ యుజి పరీక్షలలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి 100 మందికి పైగా విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సీరియస్ కామెంట్స్ చేశారు సీజేఐ. విలువైన కాలం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కార్ హయాంలో స్కామ్ లు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యూజీసీ పరీక్షలను రద్దు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని తీవ్రంగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు.
ఇదే సమయంలో తాజాగా మరో బిగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యున్నతమైన సర్వీసెస్ గా భావిస్తూ వచ్చిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
దీంతో ప్రధానమంత్రి మోడీకి ఆప్తుడిగా పేరు పొందిన చైర్ పర్సన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.