నారాయణ విద్యా సంస్థలపై ‘నేరెళ్ల’ కన్నెర్ర
మొన్న శ్రీ చైతన్య ఇవాళ నారాయణ నారాయణ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద సీరియస్ అయ్యారు. ఆమె ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. ప్రధానంగా పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటూ పిల్లలను పట్టించుకోకుండా, కనీస వసతి సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానంగా ర్యాంకుల పేరుతో టోకరా వేస్తూ ముక్కు పిండి లక్షలు వసూలు చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన శ్రీ చైతన్యం, నారాయణ విద్యా సంస్థల అడ్డగోలు దందాను ప్రశ్నించారు నేరెళ్ల శారద.
ప్రత్యేకించి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ విద్యా సంస్థలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విస్తు పోయారు. అక్కడ దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఎక్కడ కూడా శుభ్రత అన్నది లేకుండా ఉండడాన్ని చూశారు.
మంగళవారం బాచుపల్లిలోని నారాయణ మహిళా కళాశాలలో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మెన్ నెరేళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా నారాయణ మహిళా కళాశాలలో జరుగుతున్న ఘటనలపై ఆరా తీశారు.
కాలేజీ ప్రాంగణం, విద్యార్థినిల హాస్టళ్లు, మెస్‌ను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్, హాస్టల్‌లలో సౌకర్యాలు సరిగా లేవని కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్.