NEWSTELANGANA

నారాయ‌ణ కాలేజీ నిర్వాకం నేరెళ్ల ఆగ్ర‌హం

Share it with your family & friends

ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన చైర్ ప‌ర్స‌న్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర మహిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ నేరెళ్ల శార‌ద హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఆమె అసాధార‌ణ రీతిలో గ‌త కొంత కాలంగా విద్యా రంగ ప‌రంగా జూనియ‌ర్ కాలేజీల నిర్వ‌హ‌ణ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు.

ప్ర‌ధానంగా శ్రీ చైత‌న్య‌, నారాయ‌ణ‌, త‌దిత‌ర ప్రైవేట్ విద్యా సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో పిల్ల‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని, వారిని మాన‌సిక రోగులుగా , యంత్రాలుగా మార్చేస్తున్నార‌ని, క‌నీస వ‌స‌తి సౌక‌ర్యాలు ఉండ‌డం లేదంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంతే కాకుండా భారీ ఎత్తున ఫీజుల‌ను వ‌సూలు చేస్తున్నారంటూ విమ‌ర్శ‌లు రావ‌డంతో స్వ‌యంగా విమెన్ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రంగంలోకి దిగారు.

మొన్న‌టికి మొన్న మాదాపూర్ లోని శ్రీ చైత‌న్య విద్యా సంస్థ‌ల‌కు చెందిన కాలేజీని సంద‌ర్శించారు. సీరియ‌స్ అయ్యారు. స‌మ‌న్లు జారీ చేశారు. శుక్ర‌వారం బాచుపల్లి లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు.

గత కొన్ని రోజులుగా నారాయణ కాలేజీలో సమస్యల పట్ల విద్యార్థినిలు, తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్నారు తెలంగాణ మ‌హిళా కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద.

బాచుపల్లి లోని నారాయణ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీ ప్రాంగణంలోనూ విద్యార్థినిల హాస్టళ్లు, మెస్ లను తనిఖీ చేశారు. నాసిరకమైన ఫుడ్, హాస్టల్ లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించారు. కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు . అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు .