బాధితురాలికి అండగా మహిళా కమిషన్
స్పష్టం చేసిన చైర్ పర్సన్ నేరెళ్ల శారద
హైదరాబాద్ – టాలీవుడ్ కు చెందిన కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందించారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద. ఆమె మీడియాతో మాట్లాడారు. బాధితురాలికు కమిషన్ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ధైర్యంగా తనకు జరిగిన అన్యాయం గురించి, ఇబ్బందుల గురించి బాధితురాలు బయటకు వచ్చి చెప్పడం పట్ల ప్రశంసించారు. ఇదే సమయంలో ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ పూర్తి సహకారం ఇస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధితురాలిని 16 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో వేధింపులకు పాల్పడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ కొరియో గ్రాఫర్ గా ఉన్న జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ నేరం చేసిన వారికి శిక్ష తప్పదన్నారు.
సినీ ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాలలో సైతం మహిళలు, యువతుల పట్ల వేధింపులకు పాల్పడితే మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు నేరెళ్ల శారద. బాధితురాలైన కొరియో గ్రాఫర్ కు పూర్తి మద్దతు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.