‘ఐసీ814’ వెబ్ సీరీస్ పై కేంద్రం అభ్యంతరం
నెట్ ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ రావాలని ఆదేశం
ఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీ814 పేరుతో వెబ్ సీరీస్ ను రూపొందించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ అమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్.
ఈ సీరీస్ కంటెంట్ భారతీయుల మనోభావాలను ఉద్దేశ పూర్వకంగానే దెబ్బ తీసేలా ఉందంటూ ఆరోపించింది. ఈ మేరకు సమాచార, మంత్రిత్వ శాఖ నెట్ ఫ్లిక్స్ కు నోటీసు జారీ చేసింది. ఈ మేరకు సదు వెబ్ సీరీస్ కంటెంట్ హెడ్ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
హైజాకింగ్‌లో పాల్గొన్న ముస్లిం టెర్రరిస్టులకు ఈ సిరీస్‌లో భోలా, శంకర్ వంటి హిందూ పేర్లను పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్రం. వెంటనే ఇందుకు సంబంధించి పూర్తి సమాచారంతో రావాలని స్పష్టం చేసింది కేంద్ర మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 3న మంగళవారం తమ ముందుకు రావాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా హైజాకింగ్‌ను ఇబ్రహీం అథర్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ ఇబ్రహీం, షాహిద్ అఖ్తర్ , సయ్యద్ షకీర్ నిర్వహించారు.
ఈ క్రమంలో వెబ్ సీరీస్ లోని ఉగ్రవాదులకు భోలా, శంకర్ అని పేరు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్రం.