సీఎంను కలిసిన నూతన ఎమ్మెల్సీలు
కోదండరాం రెడ్డి..అమీర్ ఖాన్ లు ఖుష్
హైదరాబాద్ – తెలంగాణ శాసన మండలిలో నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండ రాం రెడ్డి, అమీర్ అలీ ఖాన్ లు మంగళవారం సచివాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్బంగా వారు మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా, మేధావిగా , ఉద్యమ నేతగా పేరు పొందారు కోదండ రాం రెడ్డి. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఆయనకు తీరని అవమానం జరిగింది. ఆ కాలంలోనే రెడ్డికి కీలక పదవి వస్తుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో సదరు మేధావిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది.
దీంతో కోదండ రాం రెడ్డి తనదైన పంథాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. అడుగడుగునా ఆటంకాలను ఎదుర్కొంటూనే ప్రజలకు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చారు తన పార్టీ తరపున. ఎన్నికల సందర్బంగా ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
తన ఎన్నిక చెల్లదంటూ బీఆర్ఎస్ నేతలు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, సత్య నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు స్టే విధించడంతో హుటా హుటిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్సీలుగా.