ENTERTAINMENT

శివ చిత్రం విడుద‌లై 35 ఏళ్లు – నాగార్జున‌

Share it with your family & friends

ఆనందం వ్య‌క్తం చేసిన న‌టుడు

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ సినీ న‌టుడు, బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబ‌ర్ 6 ఆదివారం త‌న జీవితంలో మ‌రిచి పోలేని రోజుగా పేర్కొన్నారు . ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీనికి కార‌ణం త‌న సినీ కెరీర్ లో మ‌రిచి పోలేని సినిమా వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు స‌రిగ్గా 35 ఏళ్ల కింద‌ట తీసిన శివ చిత్రం. ఇది ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ అయ్యింది.

అప్ప‌టి దాకా తెలుగు సినీ రంగంలో మూసపోత ధోర‌ణితో వ‌స్తున్న సినిమాల‌ను దాటేసి శివ రికార్డుల మోత మోగించింది. ఒక ర‌కంగా చెప్పాలంటే తెలుగు సినిమా శివ వ‌చ్చాక శివ త‌ర్వాత అనేంత‌గా చెప్పుకునేలా మారి పోయింది. అంత‌లా మార్చేసిన ఘ‌న‌త మాత్రం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

ఈ సంద‌ర్బంగా త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు న‌టుడు అక్కినేని నాగార్జున‌. శివ తీశాక‌..ఆరోజు త‌మ నాన్న దివంగ‌త అక్కినేని నాగేశ్వ‌ర్ రావుతో క‌లిసి కారులో డ్రైవింగ్ చేసుకుంటూ సినిమా చూడ‌టం మ‌ర‌చి పోలేనంటూ పేర్కొన్నారు. ఆరోజే త‌న తండ్రి శివ చూశాడ‌ని , బిగ్ హిట్ అంటూ చెప్పార‌ని, ఆయ‌న చెప్పింది అక్ష‌రాల నిజ‌మైంద‌న్నారు. నాన్నా మీ మాటలు ఎంత నమ్మశక్యం కాని నిజం అంటూ
స్మ‌రించుకున్నారు. శివ‌ను మ‌రిచి పోలేని రీతిలో విజ‌యాన్ని ద‌క్కించినందుకు ధ‌న్య‌వాదాలు అని తెలిపారు.