16 చోట్ల కొనసాగుతున్న సోదాలు
తమిళనాడు – జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. తమిళనాడులోని 16 ప్రదేశాలలో ఏక కాలంలో దాడులు చేపట్టింది. ఐసిస్ తీవ్రవాదం కేసుకు సంబంధించి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు కొనసాగుతుండడంతో ఆయా ప్రాంతాలలోని స్థానికులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్ఐఏ బృందాలకు సహకారం అందిస్తోంది. ఈ దాడులకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా జాతీయ దర్యాప్తు సంస్థ దేశ వ్యాప్తంగా దేశానికి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా అనే దానిపై విస్తృతంగా ఆరా తీస్తోంది. ఇప్పటికే దేశాన్ని అస్థిర పర్చేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి పొరుగున ఉన్న పాకిస్తాన్ , బంగ్లాదేశ్. దీనిపై ఎక్కువగా దృష్టి సారించింది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆధ్వర్యంలోని కేంద్ర హోం శాఖ.
ప్రత్యేకించి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరు పొందిన అజిత్ దోవల్. తను ఉన్నంత వరకు దేశంలో ఎక్కడా ఉగ్రవాద, తీవ్రవాద, సంఘ విద్రోహ శక్తులకు చోటు ఉండదని ఇప్పటికే ప్రకటించింది కేంద్రం. మరో వైపు నక్సలిజం పూర్తిగా అంతిమ దశకు చేరుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల అమిత్ చంద్ర షా.