SPORTS

నికోల‌స్ పూర‌న్ సెన్సేష‌న్

Share it with your family & friends

29 బంతులు 75 ప‌రుగులు

ముంబై – ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన ప్రాధాన్య‌త లేని మ్యాచ్ లో సైతం స్వంత మైదానంలో మ‌రోసారి ప‌రాజ‌యం పాలైంది ముంబై ఇండియ‌న్స్. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ప‌నితీరు దారుణంగా ఉంది. రోహ‌త్ ను త‌ప్పించినా చివ‌ర‌కు ఆశించిన మేర రాణించ లేదు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 215 ప‌రుగుల భారీ స్కోర్ ల‌క్ష్యంగా ముందుంచింది. అనంత‌రం టార్గెట్ ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ చ‌తికిల ప‌డింది. కేవ‌లం 196 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. దీంతో 18 ర‌న్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ దుమ్ము రేపితే నికోల‌స్ పూర‌న్ మాత్రం దంచికొట్టాడు. పూన‌కం వ‌చ్చిన వాడిలా చెల‌రేగాడు. కేవ‌లం 29 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 75 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 8 సిక్స‌ర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 41 బాల్స్ ఆడి 55 ర‌న్స్ చేశాడు. 3 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి.