సీఎంకు నిఖిత్ జరీన్ సలాం
డీఎస్పీ పోస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్
హైదరాబాద్ – తనను అధికారికంగా డీఎస్పీ పోస్ట్ ఇవ్వడమే కాకుండా ఘనంగా సత్కరించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారణి నిఖత్ జరీన్.
తనను గుర్తించడమే కాకుండా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. క్రీడా పరంగా తనకు గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్బంగా చెప్పారు నిఖత్ జరీన్.
ఆమెకు డీఎస్పీ పోస్ట్ ఇచ్చిన ప్రభుత్వం అధికారికంగా ముఖ్యమంత్రి నిఖత్ జరీన్ కు లాఠీని అందజేశారు. సంతోషానికి లోనైనా బాక్సర్ తాను ఈ క్షణాలను ఎప్పటికీ మరిచి పోలేనని పేర్కొన్నారు. నిఖత్ జరీన్ వయసు 28 ఏళ్లు. తన స్వస్థలం తెలంగాణలోని నిజామాబాద్. బాక్సింగ్ క్రీడా రంగం తరపున దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు నిఖత్ జరీన్.
రెండు సార్లు బాక్సింగ్ పోటీలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. బంగారు పతకాలను గెలుచుకుంది . తల్లిదండ్రులు జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా. 2021 జూన్ నుండి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు.
రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక నిఖత్ జరీన్ కు ఊహించని రీతిలో డీఎస్పీ – గ్రూప్ -1 కేడర్ పోస్టు ఇచ్చారు