దోషులు ఎవరో త్వరలోనే తేలుతుంది
ఏపీ మంత్రి నిమ్మల రామా నాయుడు
విజయవాడ – ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ ఎత్తున కురిసిన వర్షాలకు ఏపీ అతలాకుతలంగా మారింది. ప్రధానంగా ఆర్థిక రాజధానిగా పేరు పొందిన విజయవాడ దిక్కు లేనిదిగా తయారైంది.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లను తొలగించే పనులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. బోట్ల యజమానులను పోలీసులు విచారిస్తున్నట్లు చెప్పారు.
గత కొన్ని రోజుల నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగించే పనులను పరిశీలించడం జరిగిందన్నారు.
కాకినాడ నుండి వచ్చిన అబ్బులు తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు నిమ్మల రామానాయుడు. ఇప్పటికే బోట్లు కటింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు పేర్కొన్నారు.
మునిగిన బోట్లను లాగేందుకు ఒకదానికి మరొకటి లింక్ వేసి లాగేందుకు మరో 4 బోట్లను ఉపయోగించడం జరిగిందన్నారు. ఇప్పటికే బోట్ల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని మంత్రి రామానాయుడు చెప్పారు. ఈకేసులో దోషులు ఎవరెవరున్నారో త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయని తెలిపారు.